పాలకుర్తి

మినీ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

Submitted by narmeta srinivas on Thu, 10/11/2022 - 18:20

 టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపనకు సిద్దంగా ఉండాలి : కలెక్టర్

పాలకుర్తి / కొడకండ్ల నవంబర్ 10 :  కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే మినీ టెక్స్ టైల్ పార్క్ ప్రాంతంలో గురువారం జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, తెలంగాణ పారిశ్రామిక సంస్థ జోనల్ మేనేజర్, సంతోష్ కుమార్ లతో కలిసి పర్యటించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన ఉంటుందని అందుకు సిద్దంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా కోడకండ్ల మండల కేంద్రంలో ఎస్సి బాలుర వసతి గృహం సందర్శించి తొలి మెట్టు కార్యక్రమలో పిల్లలకు అం

కొడకండ్ల పురాతన శివాలయాన్ని చేరుకున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర

Submitted by narmeta srinivas on Wed, 09/11/2022 - 15:26

పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికిన వేదపండితులు

తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి : 

పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం : శ్రీ విజయ శంకర స్వామి

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 09 :  తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాన్ని, అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి అధ్వర్యంలో సంయుక్తంగా గత నెల రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర బుధవారం ఉదయం కొడకండ్ల మండలంల

శివయ్య పాదాలను అభిషేకించిన సూర్యుడు

Submitted by narmeta srinivas on Tue, 08/11/2022 - 18:36

కొడకండ్ల మహాదేవాలయంలో ఆవిష్కృతమైన అపురూప ఘట్టం

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 08 : మండల కేంద్రంలోని 700 సంవత్సరాల చరిత్ర గల అతి పురాతనమైన మహాదేవాలయంలోని శివలింగంపై ప్రతి సంవత్సరం లాగే ఈ కార్తీకమాసంలో కూడా కార్తీక పౌర్ణమి మంగళవారం రోజున శివలింగానికి తన కిరణాలతో సూర్యుడు అభిషేకించే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది.

కార్తీక మాసం సందర్భంగా అఖండ దీపాన్నివెలిగించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Submitted by narmeta srinivas on Mon, 07/11/2022 - 20:06

విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి

జనగామ / పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 07  :  జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం గుట్టపై కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా అఖండ దీపాన్ని సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెలిగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఉత్తర కాశీపీఠాధిపతి స్వామి స్థిత ప్రజ్నానంద సరస్వతి హాజరయ్యారు.

మహాదేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్తీక సోమవారం

Submitted by narmeta srinivas on Mon, 07/11/2022 - 19:32

శివనామస్మరణతో మార్మోగిన మహాదేవాలయం

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 07 : కొడకండ్ల మండల కేంద్రంలోని  అతి పురాతనమైన శివాలయంలో కార్తీక సోమవారాన్ని ఘనంగా నిర్వహించారు. మహిమాన్విత మహాదేవాలయం ఉదయం నుండి రాత్రి వరకు శివనామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. భక్తులు మహాదేవునికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాధన వితరణ జరిపారు.

పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఘనంగా నల్ల నర్సింహులు వర్దంతి

Submitted by narmeta srinivas on Sat, 05/11/2022 - 18:22

నల్ల నర్సింహులు ఆశయాలు కొనసాగించాలి : పసునూరి నవీన్ కుమార్

పాలకుర్తి / కొడకండ్ల  (ప్రజాజ్యోతి) నవంబర్ 05 :తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు నల్ల నర్సింహులు 29 వ వర్దంతి సందర్బంగా శనివారం కొడకండ్ల మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో సంఘం అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నల్లనర్సింహులు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పసునూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి ముద్దుబిడ్డ,స్వతంత్ర సమర యోధుడు,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరుడు, బి.సి.కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి,వారి అభివృద్ధి కోసం ప్రపంచ వేదికల్లో పాల్గొని

శనైశ్చర ఆలయంలో ఘనంగా శని త్రయోదశి నిర్వహణ

Submitted by narmeta srinivas on Sat, 05/11/2022 - 17:16

పాలకుర్తి / కొడకండ్ల (ప్రజాజ్యోతి) నవంబర్ 05 : కొడకండ్ల మండల కేంద్రంలోని శనైశ్చర ఆలయంలో శనివారం ఘనంగా శని త్రయోదశి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వామి పిండిపోలు మౌర్య శర్మ మాట్లాడుతూ భక్తులకు కొంగుబంగారమైన శనైశ్చర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా శనైశ్చర స్వామికి నువ్వుల నూనెతో పంచామృతాలతో అభిషేకం చేసి శని గ్రహ మూలమంత్ర హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ దేవాలయంలో శని గ్రహ దోష నివారణ పూజలు, సత్వర వివాహం, సంతానం, ఉద్యోగం,ఆరోగ్యం కలగడానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అఖండ దీపోత్సవ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లిని ఆహ్వానించిన ఆలయ పాలకమండలి

Submitted by narmeta srinivas on Fri, 04/11/2022 - 17:50

అఖండ దీపోత్సవ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ

జనగామ /పాలకుర్తి (ప్రజాజ్యోతి) నవంబర్ 04 :పాలకుర్తి లోని శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తిక మాస ఉత్సవాల సందర్భంగా ఈనెల 7 న నిర్వహిస్తున్న అఖండ దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఆలయ పాలకమండలి,ఆలయ ఈఓ రజని కుమారి శుక్రవారం హనుమకొండ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి ఆహ్వానించారు.

పుట్టినరోజు సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం తీసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు మొహమ్మద్ షన్నా

Submitted by narmeta srinivas on Fri, 04/11/2022 - 13:05

షన్నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి


పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 04 :  తెలంగాణ ఉద్యమకారుడు మొహమ్మద్ షన్నతన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌ రావును శుక్రవారం హన్మకొండ లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్యమ కారుడు షన్నాను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమంలో షన్నాతదితరులు పాల్గొన్నారు.