నాగూర

అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్ళు లు ఇవ్వాలి

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:59


వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 12 ( ప్రజా జ్యోతి) మండల కేంద్రంలో వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలోసిపిఎం పార్టీ కార్యాలయం లో మండల కమిటీ సమావేశం గ్యానంవాసు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి  పార్టీ రాష్ట్ర కంట్రోలర్ కమీషన్ చైర్మన్ భద్రాచలం మాజీ ఎంపీ  మిడియంబాబురావు హాజరయ్యారు.ఈసందర్భంగావారు మాట్లాడుతూ  మండలంలో గోదావరి ముంపు బాధితులకు ఇంత వరకు సరిగా నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. అంతేకాకుండా సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇచ్చే దళితులకు దళితభందు సక్రమంగా దళితులకు ఇవ్వాలని అన్నారు,

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తహశీల్దార్

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:35

 ( నూగూరు) సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి);  జిల్లా కలెక్టర్  సూచన మేరకు వెంకటాపురం మండలం లో సోమవారం టిసి లో తహశీల్దార్ ఆంటీ నాగరాజు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో, గ్రామ పంచాయతీ లోని  గ్రామలను సందర్శించి, గ్రామంలో విస్తృత ప్రచారం చేయాలని , ప్రజలకు నిత్యావసర సరుకులు ఇతర వస్తువులను బఫర్ స్టాక్‌లో ఉంచుకోవాలని ప్రజలను కోరాలని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఆదేశించారు.