ఇతర రాష్ట్రాల మద్యం అక్రమ రవాణా.. 103 బాటిళ్లు స్వాధీనం
ఒకరి అరెస్ట్.. కిష్టాపూర్ శివారులో ఎస్‌టీఎఫ్ దాడి
బీర్కూర్, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):
ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అధికారులు పట్టుకున్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.లింగంపేట్ మండలం బాణాపూర్ తండాకు చెందిన ధరావత్ ప్రతాప్ అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్ సీఐ కె.వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన 103 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అక్రమంగా ఇతర రాష్ట్రాల మద్యాన్ని తరలించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అయితే మండలంలో ఇతర రాష్ట్రాల మద్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ స్థానిక ఎక్సైజ్ అధికారులు మరింత నిఘా పెంచి, అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
