వినియోగదారుల మన్ననలు పొందాలి 

Nalgonda Bureau
1 Min Read

సూర్యాపేట జిల్లా ప్రతినిధి అక్టోబర్ 15 (ప్రజా జ్యోతి):వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహనికి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గర్ల్స్ అండ్ గైస్స్ ది ఫ్యాషన్ స్టూడియోను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో వస్త్రధారణకు మంచి క్రేజ్ పెరుగుతుందన్నారు.ప్రస్తుత ట్రెండ్ అండ్ క్రేజ్ కు అనుగుణంగా అన్ని విభాగాలలో వినియోగదారులకు వస్త్ర సేవలను అందించి ఆదరణ పొందాలని, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.గర్ల్స్ అండ్ గైస్స్ ది ఫ్యాషన్ స్టూడియో ద్వారా సూర్యాపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు వస్త్ర రంగంలో సంప్రదాయ, ఆధునికత కలయికతో నూతన ట్రెండింగ్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ షఫీవుల్లా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ వెలుగు వెంకన్న, కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, నాయకులు చింతలపాటి చిన్నశ్రీరాములు, వెంపటి గురూజీ,బొజ్జ ఎడ్వర్డ్, నిర్వాహకులు బొజ్జ జ్యోతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *