వలిగొండ

డిజిటల్ టీవీలతో విద్యార్థులకు సులభతరం

Submitted by Sukka.ganesh on Sun, 04/09/2022 - 11:16

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 03(ప్రజాజ్యోతి న్యూస్):డిజిటల్ టివిలలో పాఠాలు బోధించడం ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని 28 ప్రభుత్వ పాఠశాలలకు దాత బండారు మయూర్ రెడ్డి సౌజన్యంతో అందజేసిన స్మార్ట్ టివిలను వారు పంపిణీ చేసి మాట్లాడుతూ స్మార్ట్ టీవీలతో పాఠాలు బోధించడం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థం అవుతుందని విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు పంపిణీ

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 17:27

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 02(ప్రజాజ్యోతి న్యూస్): మండల పరిధిలోని అరూర్ మదిర గ్రామం మత్స్యగిరి గుట్ట నివాసి సంగి అంజయ్య కిడ్ని ఆపరేషన్ కొరకు ఎమ్మెల్సీ వెలిమినేటి కృష్ణారెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 60,000/-వేల రూపాయల చెక్కును శుక్రవారం జెడ్పిటిసి వాకిటి పద్మా అనంతరెడ్డి అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో బండారు నర్సింహారెడ్డి,పోలేపాక చెమ్మయ్య,ఆవుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆటో ఢీకొని చిన్నారి మృతి

Submitted by krishna swamy on Thu, 01/09/2022 - 18:35

యాదాద్రి(సెప్టెంబర్ 01)వలిగొండ ప్రజాజ్యోతి న్యూస్: టాటా ఏసి వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని జాలుకాల్వ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.పోలీసులు,గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని జాలుకాల్వ గ్రామానికి చెందిన బొడ్డు లింగస్వామి భవానిల ఏకైక కూతురు సితార (5) ఆ గ్రామంలోని వినాయక మంటపం వద్దకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా  అటుగా వెళుతున్న టాటా ఏసి ఢీకొని మృతి చెందింది.