సూర్యాపేట్

అజ్ఞాన అంధకారాన్ని తొలగించే చల్లని తల్లి సరస్వతి దేవి

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:17

సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./... అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే చల్లని తల్లి సరస్వతి దేవి అని ఒకటవ వార్డు కౌన్సిలర్ వేములకొండ పద్మ సైదులు అన్నారు .శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వార్డులో కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ నవరాత్రి వేళలో అమ్మవారిని కొలుచుకోవడం వలన విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు. సరస్వతి దేవి అవతారంలో భాగంగా అమ్మవారికి దవల వస్త్రాన్ని అలంకరిస్తారని ఈ దవల వస్త్రం మానసిక పరిపక్వతతో పాటు సకల విద్యలకు నిదర్శనమని పేర్కొన్నారు.

సామాన్యుడి కలలకు ప్రతిరూపం సాయి ప్రియ హిల్స్

Submitted by Upender Bukka on Mon, 03/10/2022 - 11:10

సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./....అత్యాధునిక వసతులతో సామాన్యుని కలలకు ప్రతిరూపంగా సాయి ప్రియ హిల్స్ అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు ఉప్పల ఆనంద్ ,తోట శ్యామ్ తెలిపారు .ఆదివారం పట్టణ  శివారులోని పిల్లల మర్రి పరిధిలో ఎలైట్ డెవలపర్స్ ఆధ్వర్యంలో సాయి ప్రియ హిల్స్ వెంచర్ బ్రోచర్ ను  ఆవిష్కరించారు. జాతీయ రహదారికి అనుకొని 25 ఎకరాలలో సువిశాలమైన స్థలంలో 40 ఫీట్ల బిటి రోడ్లను, వాకింగ్  సౌకర్యంతో మున్సిపల్ బోర్ నీటిని అందిస్తూ గృహ ,వాణిజ్య నిర్మాణాలకు పేదలకు అందుబాటులో లభించే విధంగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షురాలుగా వెంకటమ్మ నియామకం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:42

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్./...తెలంగాణ ముదిరాజ్ మహాసభ సూర్యపేట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలిగా జిల్లా కేంద్రానికి చెందిన సారగండ్ల వెంకటమ్మను నియమిస్తూ అధ్యక్షుడు ఈధుల యాదగిరి శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ముదిరాజ్ మహిళలను ఐక్యం చేసి సంఘ పటిష్టతకు పాటుపడుతానని, సూర్యాపేట పట్టణంలో ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

లలిత దేవి అమ్మవారిగా భక్తులకు దర్శనం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 11:04

సూర్యాపేట టౌన్ 30 సెప్టెంబర్ ( ప్రజా జ్యోతి)./... శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట పట్టణం    22 వార్డులో కొలువై ఉన్న అమ్మవారు శుక్రవారం లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు  దర్శనమిచ్చారు. నవరాత్రులలో ఐదవ రోజు చాలా విశేషమైనదని పూజారి వినోద్ తెలిపారు. లలితా దేవిని కళలకు,సౌభాగ్యానికి ప్రతికగా పిలుస్తారని పేర్కొన్నారు .ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కుంకుమ పూజను నిర్వహించారు.  ఈ కుంకుమ పూజలో వార్డు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో కమిటీ సభ్యులు గోనె విజయ, రేబేల్లి  సుజాత, కడియం విజయ, బుక్క వెన్నెల, పాశం రమ్య, ఉమామహేశ్వరి, పద్మజ తదితరులు పాల్గొన్నారు

అనుమతులు లేని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం.... జిల్లా వైద్యాధికారి కోటా చలం

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 10:41

సూర్యా పేట టౌన్ సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి)./...సూర్యాపేట జిల్లాలోని అనుమతులు లేని ఆసుపత్రులు, అర్హత లేని వారు  వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్వో డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేటలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక తనిఖీ బృందాలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... జిల్లాలోని   ఆసుపత్రులను తనిఖీ చేయడం కోరకు 8 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తనిఖీ బృందాలను కోరారు.

అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి..... శేనగాని రాంబాబు గౌడ్

Submitted by Upender Bukka on Sat, 01/10/2022 - 10:29

సూర్యాపేట టౌన్ 30 సెప్టెంబర్ (ప్రజా జ్యోతి) ./...అమ్మవారి ఆశీస్సులు, కరుణ కటాక్షం రాష్ట్ర ,జిల్లా ప్రజలపై ఉండాలని  జిల్లా తెరాస నాయకులు శేనగాని రాంబాబు గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 28వ వార్డులో ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా కోసం, జిల్లా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయనకు శక్తిని ప్రసాదించి అండగా నిలవాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా  కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు.

ప్రత్యేక పూజలో పాల్గొన్న కౌన్సిలర్ వేములకొండ పద్మ

Submitted by Upender Bukka on Fri, 30/09/2022 - 10:35

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్ ..//..సూర్యాపేట పట్టణంలోని ఒకటవ వార్డులో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమంలో  కౌన్సిలర్ వేములకొండ పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా,  తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారమని తెలిపారు. అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వ వ్యాధులు, బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

ప్రత్యేక పూజలో పాల్గొన్న కౌన్సిలర్ వేములకొండ పద్మ

Submitted by Upender Bukka on Fri, 30/09/2022 - 10:12

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్ .//..సూర్యాపేట పట్టణంలోని ఒకటవ వార్డులో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమంలో  కౌన్సిలర్ వేములకొండ పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా,  తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారమని తెలిపారు. అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వ వ్యాధులు, బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

నానమ్మ ,అమ్మమ్మ అందించే జ్ఞాన సంపద విలువైనది

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 16:23

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్.//...పేట పట్టణంలోని 48వ వార్డులో కోట మైసమ్మ బజారులో గురువారం అంగన్వాడి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ రోజును కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెలుగు వెంకన్న మాట్లాడుతూ..... ప్రపంచంలో ఏ వస్తువైనా డబ్బుతో కొనలేనిది అంటూ ఉంటే అది  తల్లిదండ్రుల ప్రేమే అని అన్నారు .నానమ్మ అమ్మమ్మ, తాతయ్య లతో కొద్ది పాటి సమయాన్ని గడుపుతే వారి  నుండి వచ్చే జ్ఞాన సంపద ఎంతో విలువైనదని తెలిపారు.  అనుభవానికి మించిన గొప్ప జ్ఞానం మరొకటి లేదని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇద్దరికి జైలు శిక్ష జరిమానా

Submitted by Upender Bukka on Thu, 29/09/2022 - 13:18

ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 28సెప్టెంబర్..//..మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికీ జైలు శిక్ష ,జరిమానా విధిస్తూ సివిల్ న్యాయమూర్తి శ్యాం సుందర్ రావు తీర్పునిచ్చారు.