Munugode Constituency

కాంగ్రెస్ నుండి బిజెపిలోకి చేరిన పలువురు సర్పంచులు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 15:00

మునుగోడు అక్టోబర్ 01(ప్రజా జ్యోతి): మునుగోడు మండల పలు గ్రామాల నుండి గ్రామ సర్పంచులు మరియు మండల నాయకులు బిజెపిలోకి 
మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డిగారు తన స్వగృహంలో నల్లగొండ DCCB డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో బిజెపి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన కల్వలపల్లి సర్పంచ్ వంటపాక జగన్,జక్కలవారి గూడెం సర్పంచ్ జక్కల శ్రీను కిస్టాపురం సర్పంచ్ నందిపాటి రాదా రమేష్, మునుగోడు కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాగర్ల లింగస్వామి యాదవ్, కొత్త శంకర్ యాదవ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పత్తి రైతు వ్యవసాయ కూలీ అవగాహన సదస్సు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:56

మునుగోడు అక్టోబర్ 01(ప్రజా జ్యోతి):   మునుగోడు మండల కేంద్రం చీకటి మామిడి గ్రామములో ఐ ఎల్ ఓ ఏఐటీయూసీ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలలో పత్తి కార్మికుల అవగాహనసదస్సు జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా నల్లగొండ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోల్గూరి నరసింహ హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువ చేయడం వలన గ్రామీణ ప్రాంతాలలో సన్నకారు చిన్న కారు రైతులు పత్తిలో భాగస్వాములు అవుతున్నారని వారికి ఎలాంటి భద్రత లేదని, అలాంటి కార్మికులను ,రైతులను గుర్తించి ప్రభుత్వాలు వారికి భద్రత కల్పించాలని అన్నారు.ILO మండల కోఆర్డినేటర్ మాట్లాడుతూ పోరాడి సాధించు

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:00

మునుగోడు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి):  బతుకమ్మ పండుగసందర్భంగా గ్రామ గ్రామాన బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ తెలిపారు శుక్రవారం మండల పరిధిలోని వివిధగ్రామపంచాయతీ ల వద్ద ఆడపడుచులకు స్థానిక మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తో కలిసి చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అన్నారు బతుకమ్మ పండుగను మహిళలు ఆత్మగౌరవంతో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొంపెల్లి సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ , కల్వకుంట్ల సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య , మరియు ఆయా గ్రామాల సర్పంచులు, సిహెచ్ వెంకట్ రెడ్డి, కర్నాటి మహేశ

అనారోగ్యంతో మృతిచెందిన వారికి ఆర్థిక సాయం పాల్వాయి. స్రవంతి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 15:14

మునుగోడు సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల కేంద్రంలో అనారోగ్యంతో మృతి చెందిన  మండల యూత్ కాంగ్రెస్ నాయకులు రామ్, లక్ష్మణ్ గారి తండ్రి గారు మునుగోటి రాములు మరణించడం జరిగింది. వారికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి  పాల్వాయి స్రవంతి రెడ్డి గారు10000 రూపాయలు ఆర్థిక సాయంగా  అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి మాజి కో ఆప్షన్ మెంబర్ ఎండి అన్వర్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి , ముచ్చపోతుల నరసింహ, పాలకూర మహేష్ ఆరేళ్ల సైదులు ,సులేమాన్ , వ్యాసరాని దినేష్తదితరులు పాల్గొన్నారు

ప్రచార రథాలను ప్రారంభించిన జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు(ప్రభు)

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:42

మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల కేంద్రంలోని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయఅధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు( ప్రభు) గురువారం రోజు 12 రథాలను ప్రారంభించారు మిగతా 100రధాలను నియోజకవర్గ స్థాయిలో త్వరలో ప్రారంభించనున్నారు.ప్రచార రథాలను పార్టీ జెండా ఊపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సామాజిక అసమానతలు మరియు పేదరిక నిర్మూలన కోసం, ప్రచారం చేయడమే జై మహాభారత్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రుక్మిణి బాయ్, లలితా బాయ్ స్వరూప శ్రీనివాస్ మరియు ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో దళితుల వనభోజన ఆత్మీయ సమ్మేళనం

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:12

మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల పరిధిలో పలు గ్రామాల్లో కొంపల్లి, చీకటిమామిడి, వెల్మకన్నె, చల్మెడ, గూడపూర్, సోలిపురం, జనస్తాన్పల్లి, పులిపలుపుల, కల్వలపల్లి, రావి గూడెం, గుండ్లూరి గూడెం,దళితుల   వనభోజన కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ దళితుల బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని దళితుల కోసం దళిత బంధు పథకం పెడితే దీన్ని బిజెపి పార్టీ వారు అనేక రకాలుగా దళితులను వ్యతిరేకిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు,దళితుల వ్యతిరేక పార్టీ బిజెపి ని ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చారు .

చర్లగూడం భూ నిర్వాసితుల కు అండగా టి ఎస్ యు అధినేత అంజి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:10

మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): చర్లగూడెం రిజర్వాయర్ కింద అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములను ప్రాజెక్టుకు తీసుకొని వారికి సరైన న్యాయం చేయలేక ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నది రిజర్వాయర్ కింద భూమి పోగొట్టుకున్న ప్రజలకు  మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర నాయకులు నల్లగొండ అంజి మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో దీక్ష చేస్తుండగా అక్రమ అరెస్టు చేసినారు.
చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములు పోగొట్టుకున్న నిర్వాసితులకు తగిన న్యాయం జరిగేదాకా నా పోరాటం ఆపనని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలను సందర్శించిన డీఈవో

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 13:13

మునుగోడు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  మండల పరిధిలో ఉన్న ఊకోండి  గ్రామ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా శాఖాధికారి డిఈఓ బిక్షపతి సందర్శించి పాఠశాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కోరారు . మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు సంబంధించిన తరగతి గదులను మరియు ప్రహరీ గోడను పరిశీలించి వీటికి సంబంధించిన మరమత్తులను త్వరగా పూర్తిచేసి పాఠశాల సిబ్బందికి అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నడింపల్లి. యాదయ్య పంచాయతీ కార్యదర్శి జానకి రాములు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.