అశ్వారావు పేట (ST)

ప్రమాదకరంగా మారిన సైడ్ డ్రైనేజీ

Submitted by veerabhadram on Sat, 24/09/2022 - 19:52

ప్రజా జ్యోతి సెప్టెంబర్ 24  చంద్రుగొండ

మండల కేంద్రం ఆయన్న పాలెం  గ్రామంలో ప్రధాన రహదారి పక్కన గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన సైడ్ డ్రైనేజీ. నిత్యం వందలాది మంది పాదచారులు, ద్విచక్ర వాహన దారులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీ మరమ్మత్తులకు గురై కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని  భయపడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చొరవ తీసుకొని మరమ్మత్తులు నిర్వహించాలని గ్రామస్తులు కోరారు.

విద్రోహదినమే

Submitted by Tirumalashetty… on Sat, 17/09/2022 - 21:50

చరిత్రను వక్రీకరిస్తున్నారు
- విమోచనమో, విలీనమో కాదు ముమ్మాటికి విద్రోహదినమే.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కా. కెచ్చల రంగారెడ్డి

రోడ్డుకు అడ్డంగా దిమ్మెల నిర్మాణం.. రాజకీయంగా వేడెక్కిన చండ్రుగొండ...

Submitted by veerabhadram on Thu, 15/09/2022 - 19:21

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 15  చండ్రుగొండ:
 రాత్రి రాత్రికే రోడ్డుకు అడ్డంగా పార్టీలు, కుల సంఘాలు, ఇతర వర్గాల దిమ్మెలు పోటీపడి నిర్మించడంతో చండ్రుగొండ పంచాయతీ ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. పలు సంఘాలు, యువకులు పంచాయతీ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి, నిర్మాణాలను తొలగించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

క్రీడామైదానం పనులలో ఎంపీడీవో, పంచాయతీ పాలకవర్గం,అధికారులు జాప్యం....

Submitted by veerabhadram on Thu, 15/09/2022 - 19:06

 ప్రజా జ్యోతి సెప్టెంబర్ 15  చండ్రుగొండ:
మండల పరిధిలోని మద్దుకూరు గ్రామపంచాయతీలో గల 139 సర్వేనెంబర్ లో గల ఎకరం ప్రభుత్వ భూమిగా సర్వే ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామపంచాయతీకి పంచనామా చేసి అప్పజెప్పడం జరిగింది. కానీ క్రీడా ప్రాంగణంలో పనులు మొదలయ్యకపోవడం వల్ల గ్రామ ఆదివాసి యువకులు ఎంపీడీవో  కార్యాలయంకి వెళ్లి అడగగా, ఎంపీడీవో అన్నపూర్ణ మద్దుకూరు పంచాయతీ పాలకవర్గం ఆ భూమి వేరే కొరదని ఆ భూమిలో క్రీడా ప్రాంగణం పనులు చేపడితే  పురుగుల మందు తాగి చనిపోతానని బెదిరించాడని, దరఖాస్తు ఇచ్చి వారం రోజులు గడువు కోరాడని తెలియజేశారు.

సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

Submitted by Tirumalashetty… on Thu, 15/09/2022 - 06:52

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
- నిజాం రాచరికపాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు... ఎమ్మెల్యే మెచ్చా

దోమతెరలను వాడాలి

Submitted by Tirumalashetty… on Tue, 13/09/2022 - 22:02

దోమతెరలు వాడాలి.. కాచి చల్లార్చిన నీరు త్రాగాలి
-మలేరియా ప్రభావిత గ్రామాలలో  దోమల నివారణ మందు పిచికారి
..ఎస్ యూఓ అజ్మీర వెంకటేశ్వరరావు 

అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేము

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 21:56

 అటవీ అమరవీరుల త్యాగాలు వృధాకావు
- అటవీ సంపదను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.. అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ 
అశ్వారావుపేట,సెప్టెంబర్11, ప్రజా జ్యోతి: అటవీ సంపదను రక్షించేందుకు

గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 17:46

గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలి

అశ్వారావుపేట, సెప్టెంబర్11, ప్రజాజ్యోతి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహిమాన్విత గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం చుట్టుపక్కల వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా భక్తులు జాగ్రత్తలు పాటించాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన ప్రకటనలో మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలో ఆలయం ఉండడం చుట్టుపక్కల వాగులు ఎక్కువగా ఉండటంతో భారీ వర్షాల వలన అవి పొంగిపొర్లుతున్నాయని, ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు