అటవీ అమరవీరుల త్యాగాలు మరవలేము

Submitted by Tirumalashetty… on Sun, 11/09/2022 - 21:56
Aswaraopeta

 అటవీ అమరవీరుల త్యాగాలు వృధాకావు
- అటవీ సంపదను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.. అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ 
అశ్వారావుపేట,సెప్టెంబర్11, ప్రజా జ్యోతి: అటవీ సంపదను రక్షించేందుకు
విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వమని అశ్వారావుపేట అటవీ క్షేత్ర అధికారి అబ్దుల్ రెహమాన్ అన్నారు. ఆదివారం స్థానిక అటవీక్షేత్రాధికారి కార్యాలయంలో అటవీఅధికారుల ఆద్వ్యర్యంలో అటవీ అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి, అసువులు బాసిన అటవీ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పట్టణ ప్రధానవిధుల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ అట‌వీ సంప‌ద‌ను ర‌క్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అట‌వీశాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నార‌న్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీ శాఖ అధికారులు అమరులయ్యారని చాలా బాధాకరంగా ఉందన్నారు. అటవీ సంప‌ద‌ను కాపాడ‌టంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, అట‌వీ సంప‌ద‌ను దోచుకునే స్మగ్లర్లు,అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాల‌ర్పించి వీర‌మ‌ర‌ణం పొందిన అట‌వీ సిబ్బంది త్యాగాలు వృధాపోనివ్వమని, వారి ఆశయాలు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారులు రమేష్, అరుణ్, భద్రు పలువురు అటవీసిబ్బంది పాల్గొన్నారు