విద్రోహదినమే

Submitted by Tirumalashetty… on Sat, 17/09/2022 - 21:50
Aswaraopeta

చరిత్రను వక్రీకరిస్తున్నారు
- విమోచనమో, విలీనమో కాదు ముమ్మాటికి విద్రోహదినమే.. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కా. కెచ్చల రంగారెడ్డి
అశ్వారావుపేట,సెప్టెంబర్17,ప్రజాజ్యోతి: తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలియని వాళ్లు వక్రీకరిస్తున్నారని, సెప్టెంబర్ 17 విమోచనమో, విలీనమో కాదని ముమ్మాటికి విద్రోహ దినమేనని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజా పంతా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అశ్వారావుపేటలోని ప్రజాపంతా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినేపల్లి ప్రభాకర్ అధ్యక్షతన డివిజన్ స్థాయి సమావేశం 200 మంది సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కా.రంగారెడ్డి మాట్లాడుతూ1946-51 మధ్య కాలంలో జరిగిన తెలంగాణ గెరిల్లా సాయుధ పోరాటం ద్వారా నిజాం నవాబు,రజాకార్ల ఆగడాలకు,అకృత్యాలకు వ్యతిరేకంగా,బలవంతపు పన్నులకు,లేవిగల్లాలకు, శిస్తులకు వ్యతిరేకంగా,భూమి,భుక్తి కోసం,వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంతో ప్రజలు పోరాడి అనేక విజయాలు సాధించుకున్నారని తెలిపారు.నిజాం నవాబు దుర్మార్గాలకు వ్యతిరేకంగా కమ్మునిస్టుల నాయకత్వంలో ప్రజలు సాయుధదళాల్లో పని చేశారని,కమ్యూనిస్టుల పోరాటానికి తట్టుకోలేని నిజాం నవాబు తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని భయపడి నాటి భారత ప్రధాని నెహ్రూ,పటేల్ ముందు మొకరిల్లి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొన్నాడని అన్నారు. చరిత్ర తెలుసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తప్పుడు సంకేతాలను అందిస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాల్వంచ డివిజన్ కార్యదర్శి ఏ.రాము, జిల్లానాయకులు కే.కన్నయ్య పి.లక్ష్మణ్ ,ఎన్.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు