భువనగిరి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలి- కలెక్టర్ పమేలా సత్పతి

Submitted by krishna swamy on Tue, 27/09/2022 - 15:38

భువనగిరి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).////. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టరు పమేలా సత్పతి  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి జ్యోతి వెలిగించి ఆచార్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పల్లె దవాఖానలో అన్ని రకాల వైద్యం అందించాలి

Submitted by krishna swamy on Thu, 15/09/2022 - 11:56

గోలీలతోపాటు సూదులు, గ్లూకోజులు కూడా ఇవ్వాలి  -కొండమడుగు నర్సింహ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

కేసారంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Submitted by krishna swamy on Mon, 12/09/2022 - 11:11

భువనగిరి, సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి) ; భువనగిరి మండలం  కేసారం గ్రామానికి  చెందిన కాశపాక  అనూష  కు ఇటీవల కాలంలో  రోడ్డు ప్రమాదానికి  గురై  హాస్పిటల్ చికిత్స పొందిన అనంతరం  వైద్య ఖర్చుల నిమిత్తం  ముఖ్యమంత్రి సహాయ నిధికి  పైళ్ల శేఖర్ రెడ్డి శాసనసభ్యులు  సిఫారసు  ద్వారా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన 32,000 రూపాయల చెక్కును  మరియు అదే గ్రామానికి చెందిన  పోతుల  ముత్యాలు  28,500, వట్టెం  లావణ్య 28,000 రూపాయల చెక్కులు మంజూరు అయినవి.

జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని బలహీన పరుస్తున్న బిజెపి ప్రభుత్వం

Submitted by krishna swamy on Mon, 12/09/2022 - 10:42

భువనగిరి, సెప్టెంబర్ 11 (ప్రజా జ్యోతి) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బలహీన పరుస్తుందని, కూలీల శ్రమను దోచుకుంటుందని మాజీ పార్లమెంటు సభ్యురాలు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించినారు.

గట్టుప్పల్ లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Submitted by veeresham siliveru on Mon, 05/09/2022 - 08:56
  • తెలంగాణ విముక్తి కోసం బిజెపిని గెలిపించండి 
  • తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సంస్థ నారాయణపురం సెప్టెంబర్ 4, ప్రజా జ్యోతి: కెసిఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి లభించాలంటే మునుగోడులో బిజెపిని గెలిపించాలని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గట్టుప్పల మండల కేంద్రంలో ఆదివారం నాడు బిజెపి కార్యకర్తల సమావేశం జరిగింది. గట్టుప్పల మాజీ సర్పంచ్ నావని గోపాల్ తో సహా పలువురు కాంగ్రెస్ నుండి  బిజెపిలో చేరారు.

రాచకొండ గిరిజన తండాలలో గండ్ర సత్యనారాయణ

Submitted by veeresham siliveru on Sun, 04/09/2022 - 16:36
  • రాచకొండ గిరిజనులకు అండగా కాంగ్రెస్- 
  • మాజీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 4, ప్రజా జ్యోతి: రాచకొండ గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ భూమి పట్టాలు ఇవ్వగా కెసిఆర్ ప్రభుత్వం ధరణి పేరుతో పట్టాలను రద్దు చేసిందని ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంస్థాన్ నారాయణపూర్ మండల ఇన్చార్జి గండ గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. మన కాంగ్రెస్ మన మునుగోడు కార్యక్రమం ఆదివారం నాడు రాచకొండలోని నాలుగు గిరిజన తండాలలో నిర్వహించారు.