పలిమెల

పట్టుబడిన వాహనం వేలం

Submitted by srinivas on Mon, 03/10/2022 - 12:48

పలిమేల అక్టోబర్ 2 ( ప్రజాజ్యోతి )  ./....పలిమేల పోలీస్ స్టేషన్  పరిధిలో ఇటీవల   పట్టుబడిన వాహనం  వేలంపాట నిర్వహించ నున్నట్టు ఎస్సై  అరుణ్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ వరంగల్  డిప్యూటీ కమిషనర్  ఉత్తర్వుల మేరకు  జిల్లా ప్రోహిబీషన్ .ఎక్సైజ్ సూపరిడెంట్ మరియు పలిమెల ఎస్సై ల  ఆధ్వర్యం లో ఈ నెల 12 న  పలిమెల పోలీస్  స్టేషన్ వద్ద   వేలంపాట నిర్వహించ నున్నట్టు  ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొని వాహనాన్ని .కైవసం చేసుకోవచ్చని ఎస్సై తెలిపారు

పోలీసుల వాహన తనిఖీలు

Submitted by srinivas on Wed, 28/09/2022 - 13:07

పలిమెల  సెప్టెంబరు 27ప్రజాజ్యోతి.//.. మండలం  సరిహద్దు మరియు గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో మావోయిస్టులు సంచరించే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రతి వాహనాన్ని పోలీసులు  క్షుణ్ణంగా పరిశీలించారు. లెంకల గడ్డ గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనపత్రాలు, వ్యక్తిగత పత్రాలు చెక్ చేసి పంపించారు. అభివృద్ధి విరోధకుల కోసం ఎలాంటి సహాయం చేయకూడదని వాహన యజమానులకు సూచించారు. అనంతరం గ్రామాల్లో డాగ్ స్క్వాడ్ తో సైతం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహన దారులు సరైన పత్రాలతో వాహనాలు నడపాలని తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్సై అరుణ్ తో పాటు సివిల్ మరియు సీఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

బురకుగూడెం లో పోడు భూములపై సమీక్ష సమావేశం...

Submitted by srinivas on Tue, 27/09/2022 - 12:03

పలిమెల, ప్రజాజ్యోతి సెప్టెంబర్ 26. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలిమేల మండల దమ్మురు గ్రామపంచాయతీలోని బురుకు గూడెంలో సోమవారం నాడు పలిమేల  తహశీల్దార్ స్రవంతి అధ్యక్షతన పోడు భూముల పై మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు నిర్వహించారు.   2005 నుండి గిరిజనులు సాగులోవుండాలని, గిరిజనేతరులు 2005 సంవత్సరం డిసెంబర్13.కంటే 75 సంవత్సరాలు సాగులోవుండాలని ఆమె తెలిపారు.ఈ  కార్యక్రమంలో  ఎంపీపీ కురుసం బుజ్జక్క .ఎం పి డి ఓ ప్రకాశ్ రెడ్డి.సర్పంచ్ మడే సుక్కమ్మ.అటవీ అధికారులు, వార్డు సభ్యులు  పంచాయితీ కార్యదర్శులు. గ్రామస్తులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Submitted by srinivas on Tue, 27/09/2022 - 11:59

పలిమెల  సెప్టెంబర్ 26 ప్రజాజ్యోతి../.. పాలిమెల తహశీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 127 వ జయంతి   వేడుకలు ఘనంగా నిర్వహించారు .చాకలి ఐలమ్మ చిత్రపటానికి   పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా తహసీల్దార్ స్రవంతి మాట్లాడుతూ  నాగరికత కు నడక నేర్పిన కులం దెబ్బతింటుందని, ఒకరిపై ఒకరు ఆధారపడి బతికే ఉత్పత్తి కులాలు కనుమరుగైతే పెను ప్రమాదం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపిడివో ప్రకాశ్ రెడ్డి,  తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది  ఎంపీడీవో సిబ్బంది పలువురు పాల్గొన్నారు

అనుమానిత వ్యక్తులు గ్రామాలలో సంచారిస్తే సమాచారం ఇవ్వండి సీఐ కిరణ్

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:37

పలిమెల  ప్రజాజ్యోతి  సెప్టెంబర్ 24..//.. కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో మహదేవపూర్ సి ఐ కిరణ్ మరియు పలిమెల ఎస్సై అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా గ్రామస్తులతో సమావేషమై మవోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మావోయిస్టుల ఫోటోలు కలిగిన వాల్ పోస్టర్ చూపిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మావోయిస్టులకు ఆశ్రయం కల్పించినా సహాయ పడినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీకి సన్నాహాలు తహసీల్దార్ స్రవంతి

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:45


పలిమేల 23 ప్రజాజ్యోతి../... పలిమేల  తహసీల్దార్ అధ్యక్షతన బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ చీరలను  పంపిణీ చేయుటకు గాను ముందస్తు సన్నహాలలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయబడింది. తహసీల్దార్ స్రవంతి  మాట్లాడుతూ  ప్రతి ఒక్క రేషన్ డీలర్ తాసిల్దార్ కార్యాలయం నుండి బతుకమ్మ చీరలను  శనివారం  నుండి రేషన్ షాపుల వారిగా గ్రామాలలో చీరల పంపిణీ చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి గ్రామపంచాయతీల కార్యదర్శిలు, సర్పంచ్ లు,  ఎంపిటిసిలు,  రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.c

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:56

 పలిమెల ప్రజాజ్యోతి సెప్టెంబర్ 17 // పలిమెల మండల కేంద్రంలో జాతీయ జెండాను  బిజెపి పలిమెల మండల అధ్యక్షులు కోయల్ కార్ నిరంజన్ ఎగరవేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం 19 47న వస్తే మనకు 1948న నిజాం రజాకార్ల నుండి మన తెలంగాణ రాష్ట్రం విముక్తి కలిగిందని అసలైన స్వతంత్రం మనకు ఈ విధంగా తెలంగాణకు రావడం జరిగిందని అదేవిధంగా రజాకారుల పాలనలో తెలంగాణలోని ప్రజలు అనేక విధాలుగా కూడా కష్టాలు పడుతూ చాలా ఇబ్బందులకు గురవడం జరిగిందని ఆనాడు ఈ రజాకారుల వికృత చేష్టల ద్వారా తెలంగాణలోని ఆడపడుచులను బట్టలు లేకుండా బతుకమ్మ ఆడ నివ్వడం అనేది వారి యొక్క నిరంకుశ మూర్ఖత్వానికి నిదర్శనమన

జాతీయ పంచాయతీ రాజ్ అవార్ద్స్ కోసం దరఖాస్తు చేసుకోండి

Submitted by sridhar on Wed, 14/09/2022 - 15:14
  • ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి 

పలిమేల సెప్టెంబర్ 14 ప్రజాజ్యోతి ; పలిమెల మండల ఆఫీసు వివిధ శాఖలతో  ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి  సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం లో  భాగంగా తొమ్మిది విభాగాల్లొ అవార్ద్ లకు ప్రపోజల్ పెటుకొవలని సూచించారు .ఈ సమావేశంలో ఎపిఒ సునీత .ఇ సి శ్రీకాంత్  , హెల్త్ సూపర్ వైజర్  నిర్మల , స్కూల్ టీచర్ శ్రీనివాసరావు ,ఏల్ ఎచ్  స్వామి, పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు  పాల్గొన్నారు

ఫాగింగ్ మిషన్లు పంపిణీచేసిన ఎంపీపీ. బుచ్చక్క

Submitted by sridhar on Tue, 06/09/2022 - 18:16

పలిమేల ప్రజాజ్యోతి సెప్టెంబర్6.వరద ప్రభావిత పలిమేల మండలంలో జిల్లాకలెక్టర్ భవేశ్ మిశ్రా,అడిషనల్ కలెక్టర్ దివాకర ఆదేశాలమేరకుమంగళవారం నాడు ఫాగింగ్ మిషన్లు ను పలిమేల ఎంపీపీ కురుసం బుచ్చక్క పంపినిచేశారు. మండలంలోని లెంకలగడ్ద,నీలంపల్లి మరియు మొదెడు గ్రామ పంచాయతీలకు ఫాగ్గింగ్ మెషిన్ సరఫరా చేశారు.ఫాగింగ్ మిషన్లు ను  దోమలను నివారణకు ఉపయోగించాలని ఆమె తెలిపారు. మలేరియా,టైఫాయిడ్  రహిత మండలంగా తీర్చిదిద్దాలని ఎంపీపీ బుచ్చక్క తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుచ్చక్క,ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి. ఆయా గ్రామ సర్పంచులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.