Kalwakurthy

అబద్ధాలు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట

Submitted by p naresh on Mon, 03/10/2022 - 14:21
  • మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
  • కల్వకుర్తికి ప్రాంతానికి జైపాల్ రెడ్డి చేసింది ఏమీ లేదు 
  •  తెలంగాణ ఉద్యమంలో మామ అల్లుళ్ళ పాత్ర లేదు

కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): అబద్ధాలు మాట్లాడడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిట్ట అనిమాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు చరిత్రను వక్రీకరించేలా అబద్ధాలు సృష్టిస్తూ పదే పదే అబద్ధాలు చెబుతూ అబద్ధాలే నిజమయ్యేలా గట్టిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, కల్వకుర్తి ప్రాంత చరిత్రను వక్రీకరించే కుట్ర చేస్తున్నారని మాజ

దసరా ఉత్సవాల ఏర్పాట్లను ప్రారంభించిన పుర ఛైర్మన్ ఎడ్మ సత్యం

Submitted by p naresh on Mon, 03/10/2022 - 13:14

కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి):   పట్టణ పరిధిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మహబూబ్ నగర్ రోడ్, మునిసిపల్ గ్రౌండ్స్ యందు ఆదివారం పుర చైర్మన్ ఎడ్మ సత్యం టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ 05.10.2022 బుధవారం  రోజున విజయ దశమి వేడుకలు నివహించేందుకు పట్టణ ప్రజలకు అన్ని విధాలుగా అనువుగా వుండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు.

సహకార బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Submitted by p naresh on Sat, 01/10/2022 - 13:02
  • నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ షణ్ముఖ చారి
  • బ్యాంకురుణాలను సకాలంలో చెల్లించాలి
  • పిఎసిఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి

కల్వకుర్తి, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  రైతులకు మెరుగైన వ్యవసాయ సహకారం అందిచెందుంకు డీసీసీబీ బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్   షణ్ముఖ చారి పేర్కోన్నారు శుక్రవారం  కల్వకుర్తి పి ఏ సి ఎస్ డి సి సి బి బ్యాంక్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

Submitted by p naresh on Sat, 01/10/2022 - 13:00

కల్వకుర్తి, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్ ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం కల్వకుర్తి నియోజకవర్గం లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం నియోజకవర్గంలో విద్యాసంస్థల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిసింది ఎమ్మెల్సీ విజ్ఞప్తి మేరకు నియోజకవర్గం లో పలు సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు

ఉప సర్పంచ్ పార్వతమ్మ కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం

Submitted by p naresh on Fri, 30/09/2022 - 15:16

కల్వకుర్తి,సెప్టెంబర్30( ప్రజాజ్యోతి):  కల్వకుర్తి మండల పరిధిలోనిబెక్కర గ్రామంలో  ఉప సర్పంచ్ గోరటి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యం తో మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెరాస రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, వారి కుటుంబానికి పరామర్శించి,10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పాండురంగ రెడ్డి, తోటపల్లి సర్పంచ్ రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు గుమ్మకొండ రాజు, ఆమన గల్లు మార్కెట్ కమిటీ సురమల్ల సుభాష్,పరుశురాములు,  జంతుక కిరణ్, వడ్డెమోని శివకుమార్, సతీష్, సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

13 వ వార్డులో సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

Submitted by p naresh on Fri, 30/09/2022 - 13:27

కల్వకుర్తి, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి),.// కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 13 వా వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సౌజన్య మాట్లాడుతూ నేషనల్ హైవే పై అనుసంధానంగా ఉన్న రోడ్లు సరిగా చేపట్టకపోవడం కాలనీ వృద్ధులకు వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు అంతేకాక వార్డులో మిషిని భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అధికారులకు కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు