మెగా రక్తదాన శిబిరానికి తరలి వెళ్లిన చండ్రుగొండ యువత

Submitted by veerabhadram on Sun, 23/10/2022 - 07:35
blood donation

చంద్రుగొండ ప్రజా జ్యోతి  అక్టోబర్ 22

కొత్తగూడెం సబ్ డివిజినల్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్. పి  డాక్టర్ వినీత్, డి.ఎస్.పి వెంకటేశ్వర బాబు సీఐ వసంత్ కుమార్, ప్రారంభించారు..
రక్తదాన కార్యక్రమంలో భాగంగా చంద్రుగొండ మండలం లోని వివిధ గ్రామాల యువత ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి పిలుపుమేరకు ఈ మెగా రక్తదాన శిబిరానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ. అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పదని మనం ఇచ్చే రక్తం ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతుందని రక్తదానం చేయడంవల్ల ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రక్తం దొరకక చాలా ఇబ్బందులు పడతారని ఇలా రక్తదానం చేయడం ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమంలో ఏ ఎస్ ఐ కృష్ణారావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ పోలీస్ సిబ్బంది. టిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు శ్రావణ్ కుమార్, కడెం రాంబాబు,మడకం నాగరాజు, మడకం ప్రసాద్ భరత్ పద్దం శివ పద్దం నాగరాజు  ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షుడు ఆసిఫ్, జనసేన మండల అధ్యక్షుడు కుక్క ముడ్డి నరసింహారావు, చాపల మడుగు నాగరాజు,ఎస్కే సమీర్, ఎస్కే నాగుల్ మీరా, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు...