ఎస్సీ ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేయాలి - గిరిజనులందరికి పక్కా నివాస గృహాలు ఏర్పాటు చేయాలి - బిఎస్ఎస్ఎమ్ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామెలు

Submitted by veerabhadram on Sun, 23/10/2022 - 07:15
sc,st girijanulaki nivasagruhalu

చండ్రుగొండ ప్రజా జ్యోతి  అక్టోబర్ 22

ఎస్సీ ఎస్టీ కమిషన్ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని. భారతీయ సర్వసమాజ్ మహాసంఘ్ (బిఎస్ఎస్ఎమ్) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు డిమాండ్ చేశారు. శనివారం బిఎస్ఎస్ఎమ్ ఆధ్వర్యంలో గిరిజనులకు పక్కా నివాస గృహాలు, మౌలిక వసతులు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుమారు 200 మంది గిరిజనులతో రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ వర్షా రవికుమార్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండల పరిధిలోని వెంకటయ్య తాండ గ్రామపంచాయతీ, వంక నెంబర్ గ్రామంలో 50 కుటుంబాలు, రావికంపాడు గ్రామంలో సుమారు 100 కుటుంబాల గిరిజనులు తాత్కాలిక ఇండ్లలో ఒక్కో ఇంట్లో 3 నుంచి 4 కుటుంబాలు అరకోర వసతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. అలాగే వీరి నివసించే ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీలు, వంటి మౌలిక వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే విషయంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ హైదరాబాద్ వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేయగా గిరిజనులకు పక్కా ఇండ్లు మౌలిక వసతులు కల్పించవలసిందిగా ఆదేశిస్తూ తాహశీల్దార్ కు లెటర్లు జారీ చేశారన్నారు. ఇదే విషయాన్ని పరిశీలించి గిరిజనులకు పక్కా ఇండ్లు, త్రాగునీరు, విద్యుత్, ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద రోడ్లు, డ్రైనేజీలు, తదితర మౌలిక వసతులు కల్పించుట అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్లు మంజూరు చేసి ఎస్సీ, ఎస్టీ, కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు చేస్తూ గింజలకు న్యాయం చేయాలన్నారు. అలాగే 2005 కు పూర్వం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారందరికీ పోడు సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ... బిఎస్ఎస్ఎమ్ మండల అధ్యక్షుడు కిన్నెర శేషు కుమార్, ఉపాధ్యక్షుడు కుంజా నాగేంద్రబాబు, జూలూరుపాడు మండల అధ్యక్షుడు భుక్య రవి, ఉపాధ్యక్షుడు బానోత్ సుదర్శన్, నాయకులు కొడెం శీతకుమారి, కుదురుపాక నిర్మలా, చీమల కోటమ్మ, కిన్నెర కరుణ, గిరిజనులు, పోడు సాగుదారులు, తదితరులు పాల్గొన్నారు.