విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలి.. * విద్యార్థుల ప్రవర్తన ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. * జిల్లా విద్యాశాఖధికారి సోమేశ్వరశర్మ..

Submitted by veerabhadram on Fri, 28/10/2022 - 17:32
student biheviyar

చండ్రుగొండ ప్రజా జ్యోతి  అక్టోబర్ 28

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన ఉపాధ్యాయులు చేయాలని జిల్లా విద్యాశాఖధికారి సోమేశ్వరశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యార్థులకు అక్షరాలపై పూర్తి అవగాహన వచ్చేలా చూడాలని, తరగతిలో పాఠాలు అర్థమయ్యేలా బోధించాలన్నారు. బోధన మెళుకువలు ఉపాధ్యాయులు తెలుసుకొని, బోధనతీరులో క్రమంగా మార్పులు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఆసక్తి పెంచేలా విద్యాబోధనలు ఉండాలన్నారు. విద్యార్థులకు కనీసం సరళపదాలు, ఇంగ్లీషులో చదవడం,రాయడం పై ఆసక్తిని కలిగించాలన్నారు. విద్యార్థులలో కనీస మార్పులు కనిపించకపోతే సంబంధిత ఉపాధ్యాయులకు చర్యలుంటాయన్నారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, ఎఫ్ఎల్ఎం సంజీవరావు, హెచ్ఎం ఆనంద్, సిఅర్పి సేవ్య, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.