దేవరకొండ

ఘనంగా జాతీయ సేవా పతాక దినోత్సవం

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 13:13

దేవరకొండ- సెప్టెంబర్-24( ప్రజా జ్యోతి)..//. మండల కేంద్రంలోని శనివారం రోజున దొంతినేని నర్సింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ తాడిశెట్టి నర్సింహా రావు అధ్యక్షతన కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్1@2    ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంప నాగేశ్వరరావు శిష్యుడు ఎన్ సుమన్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో, మంచి పౌరులుగా వుండి సమాజ  సేవ చేస్తూ జీవించాలని, మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని  తెలియజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుక

ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 12:09

దేవరకొండ పట్టణంలో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భారీ ఎత్తున  పాల్గొన్న ఉద్యోగులు, ప్రజలు, మహిళలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు 

దాతల సహకారం మరియు స్వీపర్ పదవీ విరమణ సన్మానం

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 16:49

దేవరకొండ- సెప్టెంబర్ -14 (ప్రజా జ్యోతి)డిండి మండలంలోని వావిళ్ కొలు   గ్రామ పాఠశాలలో బుధవారం రోజున గ్రామ సర్పంచ్ దొంతినేని దామోదర్రావు ఉపసర్పంచ్ చంద్రారెడ్డి దాతల సహకారంతో   ఎంపీపీ సునిత జనార్ధన్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫాం, టై బెల్టులు, కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది.

శిథిలావస్థలో ఉన్న తరగతి గదిని వంటగదిగా మార్చుకున్న వంట సిబ్బంది

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 10:18

దేవరకొండ -సెప్టెంబరు-13( ప్రజా   జ్యోతి )  డిండి మండలంలోని ప్రతాప్ నగర్  గ్రామపంచాయతీ ప్రాథమిక పాఠశాలలో నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల నందు  ఒక భవనం శిథిలావస్థలో ఉండడం మూలంగా వర్షాల వల్ల ఎప్పుడు కూలిపోతుందో అని ఉపాధ్యాయులు భయాందోళనకు గురై దాని నుండి విద్యార్థులను ఖాళీ చేయించడం జరిగింది.

గుర్తుతెలియని వ్యక్తి బంగారం అపహరణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 10:15

దేవరకొండ -సెప్టెంబర్ -13(ప్రజా  జ్యోతి) డిండి మండల కేంద్రంలోని గోన బోయినపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం నన్ను ఒక గుర్తు తెలియని వ్యక్తి బండి ఎక్కించుకొని ఎర్రగుంటపల్లి  నుండి బోనబోయినపల్లి వరకు దింపుతానని తీసుకొచ్చి శివారులో దింపి నా మెడలో బంగారాన్ని బలవంతంగా లాక్కొని వెళ్లాడు. అని చెప్పింది. వెళుతూ మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళ   దగ్గర  గుండ్ల తాడును తీసుకెళ్లాడు.ఈ విషయాన్ని ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ల ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలందరు ఆద్యాత్మిక చింతనను కల్గిఉండాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 14:27

 శాంతి, భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా భక్తి శ్రద్ధలతో  గణనాథుల శోభ యాత్రలను విజయవంతంగా చేపట్టాలి

నేనవాత్ కిషన్ నాయక్  అఖిల భారత ఆదివాసీల  కాంగ్రెస్ కో-ఆర్డినేటర్

సీపీఎస్ రద్దు కోసం కట్టమైసమ్మ దేవాలయం వద్ద పూజలు

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 13:20

దేవరకొండ-  సెప్టెంబర్ -07(ప్రజా జ్యోతి  )నల్లగొండ జిల్లా  :  మండల కేంద్రంలోని కట్టమైసమ్మ  దేవాలయం వద్ద    భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలి అన్న అభిమతం నెరవేరే వరకు ఏ చెట్టు కయినా,  ఏ  పుట్టకైన పూజలు చేస్తానని సీపీఎస్ రద్దు ఆకాంక్ష నెరవేరాలన్న ప్రబల  కాంక్షతో కట్టమైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశానని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ అసోసియేన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘనందన్  బుధవారం  అన్నారు. ఆయన డిండి జలాశయం వద్ద గుడిలో   ప్రత్యేక పూజలు చేశారు.

వినతిపత్రం అందజేత

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 12:58

 
దేవరకొండ  -సెప్టెంబర్  -7(ప్రజా జ్యోతి  ) 
డిండి మండల కేంద్రానికి చెందిన పలువురు  రైతులు  2009 సంవత్సరంలో కోల్పోయిన వ్యవసాయ భూమికి  పట్టాలు ఇప్పించాలని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు   తల్లోజు ఆచారి,జిల్లా కలెక్టర్, దేవరకొండ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.ఈ సమస్యను త్వరగా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇప్పించాలని స్థానిక ఎంపీటీసీ ఏటి రాధికా కృష్ణా పలువురు రైతులతో కలిసి బుధవారం తహసీల్దార్   ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో డిండి ఉపసర్పంచ్  వెంకటేష్ ,ఏ టి కృష్ణ ,పొలం లక్ష్మణ్, ఎడమ ఎల్లయ్య ,వావిళ్ల చిననరసింహ తదితరులు పాల్గొన్నారువినతిపత్రం అందజేస్తున్న రైతులు