హుజూర్ నగర్

అడుగడుగునా ఆటంకాలు: సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాలపురం సర్పంచ్ నాగ సైదయ్య

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:39

హుజుర్ నగర్ అక్టోబర్ 1 ( ప్రజా జ్యోతి) :  గ్రామ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా టిఆర్ఎస్ నాయకులు  అడ్డుకుంటున్నారని గోపాల పురం సర్పంచ్ నాగ సైదయ్య అన్నారు.శనివారం హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  జరిగిన సర్వసభ్య సమావేశంలో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల పనితీరును వారికి సహకరిస్తున్న పాలకుల పైన తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు.

బహిరంగ చర్చకు సిద్దం...! హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:36

హుజూర్ నగర్ అక్టోబర్ 1 ( ప్రజాజ్యోతి)./....హుజూర్ నగర్ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల అవినీతి అక్రమాల పై బహిరంగ చర్చ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఎమ్మెల్యే సైది రెడ్డి మీరు సిద్దమా... అని   కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. శనివారం హుజూర్ నగర్ పట్టణం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ ఆధ్వర్యం లో మున్సిపాలిటీ లే అవుట్ ఆక్రమణల పై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి: జూనియర్ సివిల్ జడ్జి వి. సాకేత్ మిత్ర

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:27

హుజూర్ నగర్ అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./... ఖైదీలు వారి ప్రవర్తనను మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని జూనియర్ సివిల్ జడ్జి వి. సాకేత్ మిత్ర అన్నారు.  గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం ను పురస్కరించుకొని ఆదివారం హుజూర్ నగర్ పట్టణం లో సబ్ జైల్ లో జరిగిన ఖైదీల సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు.పౌరులు శాంతిని కోల్పోయి అశాంతికి గురై సహనాన్ని కోల్పోవడం ద్వారా నేరాల కు పాల్పడి జైళ్ళ పాలవుతున్నారని, నేరాలకు పాల్పడిన వారిలో మానసిక పరివర్తన పెంపొందించడం కోసం జైళ్ళ శాఖ పనిచేస్తుందని అన్నారు.

మహాత్ముడి ఆశ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి: ఎంపీపీ గూడెపు శ్రీనివాస్

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:25

హుజూర్ నగర్ అక్టోబర్ 2(ప్రజా జ్యోతి),..///మహాత్ముడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటు పడాలనీ హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాసు కోరారు. ఆదివారం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ భవనంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసిన మహా నీయుడు గాంధీ అని కొనియాడారు. అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని సాధించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప మహోన్నతమైన స్థానాన్ని కల్పించారని ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు.

అమ్మ ఆశీస్సులతో వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలి: కౌన్సిలర్ గుంజ భవాని

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:18

హుజూర్ నగర్ అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./.. అమ్మ ఆశీస్సులతో వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలనీ వార్డు కౌన్సిలర్ గుంజ భవాని కోరారు.దేవి‌ నవరాత్రులను పురస్కారించుకుని ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని 24 వార్డు నందు దుర్గామాతకు మహిళలు కుంకమ అర్చనతో ఘనంగా పూజలు‌ నిర్వహించారు.అనంతరం  మహా అన్నదాన కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ గుంజ భవాని,వార్డు అధ్యక్షులు యడ్ల విజయ్ లు ప్రారంభించారు.ఈ‌ సందర్భంగా కౌన్సిలర్ గుంజ భవాని మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్

ఘనంగా కుంకుమ పూజ మహా అన్నదాన కార్యక్రమం

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 15:16

హుజూర్ నగర్ అక్టోబర్ 02(ప్రజా జ్యోతి) ./...దేవి‌ నవరాత్రులను పురస్కారించుకుని ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని 25వార్డు సీతారాం నగర్ లో దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాతకు మహిళలు కుంకమ పూజ, యాగం ఘనంగా  నిర్వహించారు.అనంతరం   విగ్రహ దాత సులువ చంద్ర శేఖర్ మహా అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో అందరికి మంచి జరగాలని, 25 వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో యడ్ల విజయ్, వెన్నం శ్రీను, ఓర్సు వెంకన్న,వేన్నెం.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాహాత్మనుకి ఘన నివాళి;

Submitted by Ramakrishna on Mon, 03/10/2022 - 11:20

హుజూర్ నగర్ అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి)./...గాంధీ జయంతినీ పురస్కరించుకొని ఆదివారం హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం  పులిహోర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి నర్సింహారావు ,పొలిశెట్టి లక్ష్మీ నరసింహ రావు ,వంగవీటి హన్మంతరావు, ఓరుగంటి నాగేశ్వర్ రావు ,గుండా రమేష్ ,సింగిరికొండ శ్రీనివాస్ ,ట్  శేఖర్ ,మట్టయ్య కె.నందయ్య ,పేరూరి అశోక్ ,చెపురి ఆనంతరాములు ,బోనాల నారాయణ రావు వరగాని గణేష్ ,పారుపల్లి నర్సింహారావు ,బాబు రావు తదితరులు పాల్గొన్నారు.