పంజాగుట్ట

కరాటే ఆత్మరక్షణకే కాదు సమాజ శ్రేయాస్సు కు ఉపయోగపడాలి

Submitted by Gonela Kumar on Thu, 08/09/2022 - 19:04
  • సినీ హీరో సుమన్

 పంజాగుట్ట, సెప్టెంబర్8 (ప్రజాజ్యోతి) కరాటే కేవలం ఆత్మరక్షణకే కాదు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని సినీ హీరో సుమన్ అన్నారు.గురువారం సోమజిగూడ ప్రెస్ క్లబ్ లోతైక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ అశోక్ చక్రవర్తి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశనికి సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నవంబర్ 6 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలన్నారు.

మేడ్చల్ లో సీఎం కేసీఆర్ గుడి నిర్మిస్తాం

Submitted by Gonela Kumar on Tue, 06/09/2022 - 17:41
  • షిరిడి సాయి బృందావన్ పీఠం ఫౌండేషన్

 పంజాగుట్ట,సెప్టెంబర్6(ప్రజాజ్యోతి);  తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం  కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మేడ్చల్ జిల్లాలో గుడి నిర్మించబోతున్నట్లు షిరిడి సాయి బృందావనం పీఠం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ తెలిపారు.

సివిల్ కాంట్రాక్ట్ లో సమాన రిజర్వేషన్ కల్పించాలి

Submitted by Gonela Kumar on Tue, 06/09/2022 - 17:32
  • తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 

  పంజాగుట్ట,సెప్టెంబర్ 6 (ప్రజాజ్యోతి): తెలంగాణలో వడ్డెరలకు సివిల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ, ఎస్టీ, సగరలతో సమానంగా రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్జప్తి చేసింది.