మద్దిరాల

కస్తూర్బా పాఠశాలలో బతుకమ్మ సంబరాలలో పాఠశాలవిద్యార్థులు

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 13:09

సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం../.../  మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముందస్తుగా  వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించి బతుకమ్మ పాటలతో  ను త్యాలు చేస్తూ  చిన్న పెద్ద తారతమ్య భేదం లేకుండా ఆటపాటలతో అంగరంగ వైభవంగా  బతుకమ్మ సంబరాలలో మునిగి తేలిన ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆయురారోగ్యాలతో ఉండాలని  బతుకమ్మకు వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు దండె శివ ప్రియ , దండె విష్ణు ప్రియ, మానస,నవ్య, శ్రావ్య, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

కలెక్టర్ కు మెమోరాండం ఇచ్చిన జర్నలిస్టులు

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 11:32

సూర్యపేట జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని  డి.జె.ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు మెమోరాండం.

*తెలంగాణ సచివాలయం నకు డా. B R అంబెడ్కర్ గారి పేరు పెట్టినందుకు సీఎంకు పాలాభి షేకం కృతజ్ఞతతో

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 11:02

సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం ;మద్దిరాల గ్రామంలో మరియు మండల కేంద్రంలో  జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. SA రజాక్ గారి ఆధ్వర్యంలో  డా. B R అంబెడ్కర్ గారి విగ్రహలకు పూల మాలలు వేసి, మన ముఖ్యమంత్రి వర్యులు  గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, అనంతరం తుంగతుర్తి లో జరుగు తెలంగాణ జాతీయ సమైక్యత  వారోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివెళ్లడం జరిగినది.

ఆరోగ్య స్వకేంద్రం భవన నిర్మాణ పనులు పరిశీలన

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:07

సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి)మద్దిరాల. తుంగతుర్తి శాసనసభ్యులు గౌ.శ్రీ.డా. గాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోజు  మద్దిరాల మండలం లోని రెడ్డిగూడం గ్రామంలోని  ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. SA రజాక్  ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ దుగ్యాల రవిందర్ రావు, బెడద వెంకన్న, తదితరులు పాల్గొన్నారు

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో వార్డులో మహా అన్నదాన కార్య క్రమం

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 13:08

 మద్దిరాలమండలంసెప్టెంబర్ 9(ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని 7 వార్డులో రాయల్ కింగ్స్ యూత్ అన్నదాతలు నెల్లుట్ల కృష్ణ సుమలత వల్లపు మల్లయ్య పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశుని వద్ద ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బోలగాని ఉపేందర్ నెల్లుట్ల నటరాజ్ బొలగాని ఉపేందర్ టు గజ్జి ఉపేందర్ జంబారపు క్రాంతి బొలగాని గణేష్ పగిళ్ల శివాజీ గోల్కొండ ప్రశాంత్ తన్నీరు ఉమేష్ నెల్లుట్ల నవీన్ నెల్లుట్ల ఉదయ్ జక్కుల మహేష్ నెల్లుట్ల సాగర్ తదితరులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ గ్రామాలకు చెక్కుల పంపిణీ

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 17:34

సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి)  మద్దిరాల మండలం లోని వివిధ  గ్రామాలకు చెందిన వారు  అనారోగ్యంతో  హాస్పిటల్ లో చేరగా , తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ.శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్ గారి  ఆశీస్సులతో సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయగా  ,మద్దిరాల గ్రామానికి  చెందిన భూతం నాగయ్య కు  40000 రూపాయల చెక్కు, మెడిదుల వెంకన్న 17000, గోరెంట్ల గ్రామానికి చెందిన పాల్వాయి విజయ కు 38500,జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన v. కలమ్మ 30000,చౌళ్ల తండ కు చెందిన B. సైదమ్మ 60000,చిన్న నేమిల గ్రామానికి చెందిన S.పాపయ్య 50000, గుట్టకాడి తండ కు చెందిన బాణోత్ లాలి 24000,పడిమటి తండ కు చెందిన D.