గ్రామాల్లో వీబీ-జీ రామ్ జీ పథకంలో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలి 

Warangal Bureau
2 Min Read

గ్రామాల్లో వీబీ-జీ రామ్ జీ పథకంలో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలి

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి

ప్రతి గ్రామంలో నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

  • పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఆత్మకూరు, నవంబర్ 11 (ప్రజాజ్యోతి):

గ్రామాల్లో వీబీ-జీ రామ్ జీ పథకంలో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మండల అధికారులకు సూచించారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని మండల పరిధిలోని సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులతో మంచినీటి సరఫరా, విభి-జీ రామ్ జి పథకం, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందేలా చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులను పరిరక్షించాలని, బావుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గ్రామాల్లో భూగర్భ జలమట్టాన్ని తప్పనిసరిగా పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వీబీ-జీ రామ్ జీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రతి జాబ్ కార్డు కలిగిన కూలీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా అవగాహన కల్పించి, పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. నీటిని వృథా చేసే వారిపై ఫిర్యాదులు అందినట్లయితే విచారణ జరిపి రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచినీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతుల జీవనాధారం వంటి సున్నితమైన అంశాలపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం సరికాదని, ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. భూగర్భ జలాల సంరక్షణ, నీటి పొదుపు, ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరా లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *