హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ సుబేదారి నుండి భీమారంలోని పోలీస్ క్వార్టర్స్‌కు తరలింపు.
వరంగల్ బ్యూరో, అక్టోబర్ 31 (ప్రజాజ్యోతి):
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పై అంతస్తులో నిర్వహించబడుతున్న హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ ను భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనానికి మార్చబడినది.
వరంగల్ సిపి N. శ్వేత , ఐపీఎస్ మహిళలకు, ఫిర్యాదుదారులకు పోలీస్ సేవలు మరింత సులభంగా అందుబాటులో ఉండేలా ఈ చర్య తీసుకున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీస్ స్టేషన్ ను నిర్వహించడానికి సరిపోవడం లేదు, అలాగే ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి స్థలం సరిపోవడం లేక పోవడం వల్ల, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, విశాలమైన ప్రాంగణం లో మహిళా పోలీస్ స్టేషన్ ను మరియు సర్వోదయ NGO ఆధ్వర్యం లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
2026 నవంబర్ 1వ తేదీ నుంచి హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ నూతన ప్రాంగణం నుంచి ప్రజలకు సేవలు అందిస్తుంది.
కావున, ప్రజలు ఈ మార్పును గమనించి, నవంబర్ 1వ తేదీ నుంచి భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ భవనంలో హనుమకొండ మహిళా పోలీస్ స్టేషన్ సేవలను పొందగలరు.

