ఎండిపోయిన వరి పొలాల పరిశీలన
— ఏఈఓ మినుకుల రాకేష్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 05 (ప్రజా జ్యోతి)
గొల్లపల్లి గ్రామంలో ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గిపోవడంతో నీటి లభ్యత లేక ఎండిపోయిన వరి పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్ క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా పంట నష్టానికి గల కారణాలను పరిశీలించి, రైతుల నుంచి వివరాలు సేకరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ యాదవ్, ఉప సర్పంచ్ మధుసూదన్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
