పీఏసీఎస్ నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకారం
ఆత్మకూరు, పెంచికలపేట సొసైటీల్లో ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి
ఆత్మకూరు, అక్టోబర్ 29 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నూతన చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్గా నాగేల్లి స్వప్న, మధ్యాహ్నం 3 గంటలకు పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్గా ఏగితే లింగన్న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, రైతు సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని రేవూరి జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
