ప్రభుత్వ భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు

జేసీబీ స్వాధీనం చేసుకున్న రూరల్ పోలీసులు

Siddipet Bureau
1 Min Read

సిద్దిపేట రూరల్ , అక్టోబర్ 22 , (ప్రజాజ్యోతి): ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వుతున్న జేసీబీని సిద్దిపేట రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇర్కోడ్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 780లో ఈ ఘటన చోటుచేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ భూమి నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఇర్కోడ్ గ్రామ జీపీఓ మెట్ల రాజ్‌కుమార్, వీఆర్ఏ మహేష్ అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ జేసీబీతో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.విచారణలో జేసీబీ ఇర్కోడ్‌కు చెందిన కుంభం సురేష్ రెడ్డికి చెందినదిగా, దానిని కుచుల యాదగిరి నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టినట్లు పేర్కొంటూ జీపీఓ మెట్ల రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై ఎస్‌ఐ డి. నవత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు  తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *