50 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనుల కోసం స్థల పరిశీలన

కొడంగల్ అభివృద్ధికి మరో ముందడుగు –తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలమేరకు రోడ్డు పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు సూచన
కొడంగల్, అక్టోబర్ 23 ప్రజా జ్యోతి న్యూస్ :
కొడంగల్ పట్టణ అభివృద్ధిలో భాగంగా లహోటి పార్క్ నుండి శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు చేపట్టనున్న 50 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు శుక్రవారం రోడ్డు స్థలాన్ని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ,
మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ , MRO రాంబాబు మరియు R&B అధికారులతో కలిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు కొడంగల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
