చిన్నారి పెద్ద మనసు.. అమ్మవారి గుడికి విరాళం

- గల్లాలో దాచుకున్న రూ.1,116 ఆలయ నిర్మాణానికి అందజేత

Siddipet Bureau
1 Min Read

చేర్యాల,అక్టోబర్ 21(ప్రజాజ్యోతి): చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో నిర్మిస్తున్న దుర్గమ్మ ఆలయ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని యుహిత నాగశ్రీ తన పొదుపు సొమ్మును విరాళంగా అందజేసి అందరి ప్రశంసలు అందుకుంది. ముస్త్యాల గ్రామానికి చెందిన దాది శివాజీ కుమార్తె యుహిత నాగశ్రీ మోడల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది.తన గల్లాలో రూపాయి రూపాయి దాచుకున్న మొత్తం రూ.1,116లను దుర్గమ్మ ఆలయ నిర్మాణం కోసం అందజేసింది.చిన్న వయసులోనే దైవభక్తి, దాతృత్వం, సేవాభావాన్ని చాటుకున్న యుహిత నాగశ్రీని పలువురు అభినందించారు. తన పొదుపు సొమ్మును అమ్మవారి ఆలయ నిర్మాణానికి అందించడం అభినందనీయమని, ఈ చిన్నారి మంచి ఆలోచన ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చిన్నారిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులను కూడా అభినందించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *