సిద్ధిపేట రూరల్ ,అక్టోబర్ 11 ,(ప్రజాజ్యోతి): సీతారాంపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యంతో కొనసాగుతున్నాయి. యువసేన యూత్ ఆధ్వర్యంలోని దేవి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఐదో వార్డు సభ్యుడు గుర్రం రాజశేఖర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టుచీర, పూజా సామగ్రిని సమర్పించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.తారాంపల్లిలో యువసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మిట్టపల్లి సుధాకర్‌తో పాటు మిట్టపల్లి సందీప్, మిట్టపల్లి స్వామి, మిట్టపల్లి దుబ్బ నవీన్, మిట్టపల్లి దేవరాజ్, మిట్టపల్లి మహేష్, మిట్టపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
