టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma), యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబినేషన్‌లో వచ్చిన హనుమాన్ సినిమా(Hanuman Movie) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ అంచనాలు లేకుండా విడుదలై.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన సైతం విడుదల చేశారు.
ఇదిలా ఉండగా.. సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర పోస్టు పెట్టారు. చేతిపై హనుమంతుడి గద పచ్చబొట్టుగా వేయించుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, హనుమాన్‌లో అమృత అయ్యర్, వరలక్ష్మి, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీనులు కీలక పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దీనికి ‘జై హనుమాన్’ అనే టైటిన్‌ను ఖరారు చేశారు. ఇందులో కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఆయన లుక్‌ను విడుదల చేయగా.. అందరికీ ఆకట్టుకున్నది.