వివాదాలు లేకుండా సర్వే నిర్వహించాలి..!!

Warangal Bureau
1 Min Read

వివాదాలు లేకుండా సర్వే నిర్వహించాలి

పరకాల ఆర్డీవో డీఎస్ వెంకన్న

ఆత్మకూరు, అక్టోబర్ 24 (ప్రజాజ్యోతి):

రీ సర్వే కార్యక్రమాన్ని ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) డీఎస్ వెంకన్న సూచించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం బ్రాహ్మణపెల్లి గ్రామంలో జాతీయ రహదారి సరిహద్దుల నిర్ధారణ కోసం నిర్వహిస్తున్న రీ సర్వే కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆత్మకూరు తహసీల్దార్ ఎన్. జగన్ మోహన్ రెడ్డితో కలిసి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఆర్డీవో పర్యటించారు. సర్వే నిర్వహణ తీరును, జాతీయ రహదారి సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. రీ సర్వే ముఖ్య ఉద్దేశాలను రైతులకు వివరించారు. రైతులందరూ సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించాలని, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా సర్వేను పారదర్శకంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ రఘు ప్రసాద్, గ్రామ పాలన అధికారి సతీష్, లైసెన్స్‌డ్ సర్వేయర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *