టిప్పర్ బ్యాటరీల దొంగ అరెస్ట్..

Warangal Bureau
1 Min Read

టిప్పర్ బ్యాటరీల దొంగ అరెస్ట్

రూ.20 వేల విలువైన రెండు బ్యాటరీలు స్వాధీనం

ఆత్మకూరు, అక్టోబర్ 27 (ప్రజాజ్యోతి):

ఆగి ఉన్న టిప్పర్ వాహనాల నుంచి బ్యాటరీలను దొంగిలిస్తున్న నిందితుడిని ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు. సీఐ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు జంక్షన్‌లోని రాజరాజేశ్వరి పంక్చర్ షాప్ వద్ద నిలిపి ఉంచిన టిప్పర్ వాహనంలోని బ్యాటరీలను వరంగల్‌లోని కాశిబుగ్గకు చెందిన పస్తం ఐలుకుమార్ దొంగిలించాడు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన ఆత్మకూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి సుమారు రూ.20 వేల విలువైన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గత జూలై నెలలో గూడెప్పాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రేగొండ మండలానికి చెందిన మేకల భాస్కర్‌రెడ్డికి చెందిన టిప్పర్ వాహనంలోనూ రెండు బ్యాటరీలను నిందితుడు దొంగిలించినట్లు సీఐ వెల్లడించారు. అనంతరం నిందితుడిని పరకాల కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరణ్, మహిళా కానిస్టేబుల్ ప్రవళిక, హోంగార్డు రామన్న పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *