తూప్రాన్ ప్రజా జ్యోతి అక్టోబర్ 28 :
తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మున్నా (23) చెరువు నీటిలో పడి మృతి చెందినట్లు తూప్రాన్ ఎస్సై గంగరాజు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.యువకుడి మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
