కుల వివక్ష , మాల పోచమ్మ చిలకలమ్మ గుడి అడ్డుకుంటున్నారు 

Rammoorthy Kamareddy
2 Min Read

కుల వివక్ష మాల పోచమ్మ చిలకలమ్మ గుడి అడ్డుకుంటున్నారు 

— గ్రామ విడిసి కమిటీ 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31(ప్రజా జ్యోతి)

ఉప్పల్ వాయి గ్రామంలో మాల పోచమ్మ, మాదిగ చిలకలమ్మ గుడి నిర్మాణాన్ని గ్రామ విడిసి కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని, వారి పైన చర్యలు తీసుకొని వెంటనే వారినీ అరెస్ట్ చేయాలని అంబేద్కర్ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్ సంఘం,మాల మహానాడు సంఘం డిమాండు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్లొ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కోత్తోల్ల గంగారం, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బట్ట వెంకట రాములు, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ సుధాకర్, ప్రసన్న మాట్లాడుతూ ఉప్పల్ వాయి గ్రామంలోని గత విడిసి ఆధ్వర్యంలో గ్రామంలో ఒకే వద్ద 8 గుళ్లను కట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని, కొత్తగా వచ్చిన విడిసి కమిటీ సభ్యులు కుల వివక్షత చూపిస్తూ ఇక్కడ మాల పోచమ్మ, మాదిగ చిలుకలమ్మ గుడి కట్టొద్దని అంటున్నారని, దీనిపైన జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే వీడీసీ కమిటీ పైన కేసు నమోదు చేయడం జరిగింది తెలిపారు. అన్ని గుళ్ళతో పాటు మాల పోచమ్మ గుడి, మాదిగ చిలుకలమ్మ గుడి అన్ని గుడి నిర్మానులతో పాటు మా గుళ్లను కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. విడీసీ కమిటీ సభ్యులు రోజురోజుకు మితిమీరుతున్నాయని వీడిసి సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షుడు కంకణాల రమేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు ధ్యామణి భూపతి, ఆర్టిఐ లేగ్గేలా రాజు, ఎమ్మార్పీఎస్ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, ఉప్పల్ వాయి మాల కులగ్రామస్తులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *