కాంగ్రెస్ గ్రామ యూత్ ఏకగ్రీవం ఎన్నిక
— యూత్ అధ్యక్షులు గాండ్ల రంజిత్
కామారెడ్డి జూన్ 27 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని కన్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కమిటీని శనివారం ఏర్పాటు చేయడం జరిగింది.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్,ఎల్లారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు సర్ధార్ నాయక్ ఆదేశానుసారం రామరెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గాండ్ల రంజిత్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ కమిటీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేన్నం శెట్టి రమేష్ ని, ఉపాధ్యక్షులు మంగళి ప్రవీణ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,గ్రామ అధ్యక్షులు, యూత్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
