అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌కు ఘన స్వాగతం
శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘన సన్మానం
పరిగి, ఆగష్టు 12 (ప్రజాజ్యోతి):అమెరికాలో నిర్వహించిన ATA సభల్లో పాల్గొని పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డికి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యే రాకతో విమానాశ్రయ పరిసరాల్లో సందడి నెలకొంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్, కౌన్సిలర్లు ఆరిఫ్ పటేల్, హబీబునిస అయూబ్, బాదం అఖిల శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, అక్బర్ హుస్సేన్, ఫిరంగి వెంకట్రాం రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
