ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష..

Warangal Bureau
1 Min Read

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష..

32 కేంద్రాల్లో 16,782 మంది అభ్యర్థులు హాజరు..

వరంగల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రజ్యోజ్యోతి):

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కమిషనరేట్ పరిధిలోని 32 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, మొత్తం 18,194 మంది అభ్యర్థులకు గాను 16,782 మంది హాజరయ్యారు. మరో 1,412 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు కేంద్రాలను ఆరు రూట్లుగా విభజించి, ఏసీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష సజావుగా నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడానికి సహకరించిన అభ్యర్థులు, సిబ్బంది, అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ కృతజ్ఞతలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *