ఓటరు జాబితాలో పేరు లేదా..? మరో అవకాశం
నవంబర్ 30లోగా ఏనుమరేషన్ ఫారాలు అందజేయాలి
తహసీల్దార్ రేణుక చౌహన్
గాంధారి, నవంబర్ 25 (ప్రజాజ్యోతి)
ఓటరు జాబితాలో ఆబ్సెంట్ / షిఫ్ట్ / కారణంగా ఏనుమేరేషన్ ఫారం ఇవ్వలేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గతంలో ఏఎస్ డిడి కారణాలతో ఫారాలు అందజేయని వారు ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ)కు ఫారాలు అందజేయాలని గాంధారి తహసీల్దార్ రేణుక చౌహన్ సూచించారు.గాంధారి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల పరిధిలోని అర్హులైన ఓటర్లు ముసాయిదా జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని కోరారు. జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్దేశిత గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం సంబంధిత బీఎల్ఓలు ఏఎస్ డిడి కి చెందిన ఏనుమరేషన్ ఫారాలు ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30 వరకు ఫారాల డిస్ట్రిబ్యూషన్ మరియు స్వీకరణ, డిసెంబర్ 10 వరకు అప్డేషన్, డిస్పాసల్ డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ చేపట్టనున్నారు. డిసెంబర్ 22న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకమని, అర్హులైన వారు ఎవరూ ఓటరు జాబితాలో పేరు లేకుండా ఉండకూడదని తహసీల్దార్ పేర్కొన్నారు. గాంధారి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
