సిద్దిపేట అర్బన్,ఆగస్టు 09 ,(ప్రజాజ్యోతి): శ్రీనివాసనగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ వనభోజన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు పెద్ది మల్లికార్జున్ ఆధ్వర్యంలో కిష్టసాగర్ సమీపంలోని శృంగేరి పీఠం ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్ర పారాయణం నిర్వహించారు. అనంతరం మహిళలు, చిన్నారుల కోసం వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ప్రత్యేకంగా మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఒకరికొకరు మెహందీ వేసుకుంటూ ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పెద్ది మల్లికార్జున్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వనభోజన కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు ఆత్మీయత, స్నేహభావం మరింత పెంపొందుతాయన్నారు. సంఘ సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు సంప్రదాయాలు, సంస్కృతిని కొనసాగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
