రేపు మంగళవారం సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన

Vikarabad Staff Reporter
1 Min Read

రేపు మంగళవారం సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన


కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కొడంగల్ జులై 20 ప్రజా జ్యోతి న్యూస్ :

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల, హకీంపేట్ ఇంటిగ్రెటెడ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు తేదీ 21-7-2026 నాడు పరిశీలించ నున్న నేపథ్యంలో జిల్లా ఎస్ పి స్నేహ మెహర లతో కలిసి ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

సోమవారం
వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం కడ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్య మంత్రి గారు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించనున్నారని,ఇందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
హెలిప్యాడ్, ఇంటిగ్రెటెడ్ ఎడ్యుకేషన్ హబ్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మొత్తం 9 బ్లాక్ లలో బారికేడ్లు, పూర్తి స్థాయి లో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ పర్యటన లో అడిషనల్ ఎస్ పి రాజేష్ మీనా, డి ఎస్ పి శ్రీనివాస్,కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *