శివాపూర్ పంచాయతి సెక్రటరీ ఉత్తమ అవార్డు
ఎల్లారెడ్డి, జనవరి -26 (ప్రజా జ్యోతి )
ఎల్లారెడ్డి మండలంలోని శివాపూర్ గ్రామపంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సవితకు ఉత్తమ అవార్డు అందుకున్నట్లు ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేరా బేగం అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. మండలంలోని శివాపూర్ గ్రామ సెక్రెటరీ ఉత్తమ సేవలు అందించినందుకు అవార్డు వరించిందని దీంతో ఎల్లారెడ్డి మండల ప్రజా పరిషత్ అధికారులు సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.
