ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై అవగాహన
— ఏడిఏ సుధ మాధురి,
ఏఈఓ రాకేష్
రామారెడ్డి జూలై 18 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలంలోని రంగంపేట గ్రామంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం, పంటలపై దాని ప్రభావం, నీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై వివరించడం జరిగింది.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని, వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని రైతులకు సూచించారు.ప్రస్తుతం కంది, పెసర, మినుము, ఆముదం, పొద్దు తిరుగుడు , సజ్జలు, రాగులు, వేసుకోవాలి అని సూచించడం జరిగింది. తక్కువ నీటి వసతి ఉన్న పంటలను పండించి దిగుబడులు సాధించాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రంగంపేట సర్పంచ్, గ్రామ రైతులు, ఎల్లారెడ్డి ఏడిఏ సుధ మాధురి,ఏఈఓ రాకేష్ మినుకుల,గ్రామ రైతులు పాల్గొన్నారు.కార్యక్రమంలో రైతుల సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చి, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.పలు సూచనలు చేయడం జరిగింది.
