ఎస్‌ఐఆర్–2026 షెడ్యూల్ సవరణ…. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ – అక్టోబర్ 12న తుది జాబితా విడుదల

1 Min Read

ఎస్‌ఐఆర్–2026 షెడ్యూల్ సవరణ విడుదల

  • ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ – అక్టోబర్ 12న తుది జాబితా విడుదల

పరిగి, జూలై 15 (ప్రజాజ్యోతి):

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 01 అక్టోబర్ 2026ను అర్హత తేదీగా నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమానికి సంబంధించి సవరించిన నూతన షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు 54-పరిగి నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి కార్యాలయం వెల్లడించింది.

నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఆగస్టు 3న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది.

అలాగే ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన మరియు పరిష్కార ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

ఈ నేపథ్యంలో పరిగి నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పౌరులందరూ తమ ఓటు నమోదు, పేరు మార్పులు, చిరునామా సవరణలు తదితర అంశాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. ప్రజలు బీఎల్‌ఓలను సంప్రదించి అవసరమైన వివరాలు సమర్పించాలని సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *