సిద్ధిపేట, జులై 11, (ప్రజాజ్యోతి): ఉపకారం పొందిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకోవడం అరుదుగా మారుతున్న ఈ రోజుల్లో సిద్దిపేటకు చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి రోహిత్ తన కృతజ్ఞతను చేతల్లో చూపించాడు. ఇంజనీరింగ్ సీటు కోసం గతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన సహాయాన్ని మరువకుండా, ఉద్యోగంలో చేరిన తర్వాత తన తొలి ఆరు నెలల వేతనానికి సమానమైన ఆరు లక్షలను హరీష్ రావు చేపడుతున్న సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సహాయం పొందిన తర్వాత దాన్ని గుర్తుంచుకుని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచనతో ముందుకొచ్చిన రోహిత్ నేటి యువతకు ఆదర్శం. ఇలాంటి యువతే సమాజానికి నిజమైన బలమని కొనియాడారు. అనంతరం రోహిత్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు.
