చేర్యాల, జూలై 6(ప్రజాజ్యోతి):చేర్యాల మండల తహశీల్దార్ (ఎంఆర్‌ఓ) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఒక భూమి రికార్డుల పనుల నిమిత్తం వచ్చిన బాధితుడి నుండి 70,000 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ దిలీప్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
