సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 05(ప్రజాజ్యోతి):రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబర్చి నేషనల్ స్థాయికి ఎంపికైన దోసపాడు గ్రామానికి చెందిన భోగరాజు హరినాథ్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకులు శేనగాని రాంబాబు గౌడ్ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి,క్రీడల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర,జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందడం అభినందనీయమని పేర్కొన్నారు.భోగరాజు హరినాథ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ బెంజారపు రమేష్ గౌడ్,గుడుగుంట్ల గోవర్ధన్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎస్‌కే సాజిత్ ఖాన్,ఎస్‌బీ కానిస్టేబుల్ రమేష్ గౌడ్,ఏఆర్ కానిస్టేబుల్ కొమ్మానబోయిన గోపి,పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎస్‌కే అబ్బాస్ బాయ్,పేర్ల గిరి యాదవ్,సాధనాల ఉపేందర్,తరాల కిరీటి యాదవ్,రానపంగు భ్రమ్మం జాటోత్ తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
