నేడు పల్స్ పోలియో టీకా కార్యక్రమం
– డా. ఎం. సురేష్, వైద్యాధికారి
రామారెడ్డి జూన్ 27 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల పరిధిలోని పీహెచ్‌సీ రామారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 28 న పల్స్ పోలియో టీకా కార్యక్రమం ప్రారంభం కానుంది.ప్రమాదకరమైన పోలియో వ్యాధి నుండి పిల్లలను జీవితాంతం రక్షించేది కేవలం రెండు చుక్కల పోలియో మందు అందువల్ల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని డా. ఎం. సురేష్ తెలిపారు.ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ప్రతి గ్రామం, ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు.మొదటి రోజు అన్ని పోలియో బూత్‌లలో టీకా కార్యక్రమం నిర్వహించబడుతుంది. రెండవ మరియు మూడవ రోజుల్లో ఆరోగ్య సిబ్బంది. ఇంటింటికి వెళ్లి మొదటి రోజు మిస్ అయిన పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు.ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదు 100% పోలియో టీకా కవరేజ్ సాధిద్దాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు.రెండు చుక్కలు జీవితాంతం రక్షణ పోలియో రహిత సమాజ నిర్మాణంలో తల్లిదండ్రులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామి కావాలి కోరారు.
