నాగిరెడ్డిపేట్,జులై9(ప్రజాజ్యోతి):
నాగిరెడ్డిపేట్ మండలానికి నూతన ఎస్సైగా గా పదవి బాధ్యతలు చేపట్టిన భార్గవ్ గౌడ్ ను బుధవారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారిమనోహర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య,ఎంపీటిసిల ఫోరం మాజీ అధ్యక్షుడు మోతె శ్రీనివాస్,నాయకులు వంశీగౌడ్,యాదగిరి,శ్రీనివాస్ గౌడ్,ఫరీద్,,హన్మంత్ రెడ్డి,కాంత్ రెడ్డి,బాబురావు,సాయిలు,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
