డిఎల్పీవో సురేందర్….
నాగిరెడ్డిపేట్,ఏప్రిల్1(ప్రజాజ్యోతి);
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేడు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పకడ్బందీగా నిర్వహించాలని డిఎల్పీవో సురేందర్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా డిఎల్పీవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గ్రామా సభలకు గ్రామానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారని కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్థాయి,గ్రామస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సలహాలు సూచనలు చేశామన్నారు.గ్రామ సభల్లో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్థానిక అభివృద్ధి, పారదర్శకత సాధ్యమవుతుందని మండలంలోని ప్రతి గ్రామంలో పకడ్బందీ ప్రణాళిక అమలు చేయాలని,ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు రైతులు తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ గ్రామా సభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామంలో చది వివినిపించాలని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మఇండ్లు, నూతన రేషన్ కార్డు,సన్న బియ్యం సరఫరా,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం,వంటి వివిధ పథకాల లబ్ధిదారుల వారు పొందుతున్న లబ్ధి గురించి మాట్లాడించాలని ఆదేశించారు.జూన్ 2 నుంచి ప్రారంభించే ,ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్య క్రమంతోపాటు పాలు లేదా రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అలాగే ఇంటర్మీడియేట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం గురించి వివరించాలన్నారు.డిఎల్పీవో వెంట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,ఎంపివో ప్రభాకర్ చారీ ఉన్నారు.
