12న పర్వతగిరిలో మండల సర్వసభ్య సమావేశం
పర్వతగిరి, నవంబర్ 10 (ప్రజాజ్యోతి):
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 12న గురువారం ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు. సమావేశంలో గ్రామీణ తాగునీటి సరఫరా, విబి-జిరామ్ జి పథకం, పారిశుధ్యం, 16వ ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, రహదారులు, సంక్షేమ హాస్టళ్లు సహా మొత్తం 30 అంశాలపై సమీక్షించనున్నారు. మండలంలోని సర్పంచులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరుకావాలని సమావేశ నోటీసులో కోరారు.
