జగిత్యాల్

ఘనంగా ఎమ్మెల్సీ రమణ జన్మదిన వేడుకలు

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 17:59

జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో టీఆర్ఎస్  నాయకులు యేలేటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సీటీజన్స్ సారంగాపూర్ మండల అధ్యక్షుడుగా కాలగిరి గంగరెడ్డి

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 17:55


జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : తెలంగాణ అల్ సీనియర్ సీటీజన్స్ అసోసియేషన్ సారంగాపూర్ మండల అధ్యక్షుడుగా కాలగిరి గంగ రెడ్డిని నియమించినట్లు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జగిత్యాల పట్టణం, మండలం, సారంగాపూర్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి మండలాలకు చెందిన పలువురికి సీనియర్ సీటీజన్స్ కార్డులు అందజేశారు.

ఇటిక్యాలలో పిడుగుపాటుకు రైతు మృతి

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 13:57

జగిత్యాల క్రైమ్, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం పిడుగు పాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు గడ్డం రాజిరెడ్డి (60) తన వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా వర్షంతో పాటు పిడుగు పడి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నుండి పొలంకు వెళ్లి వస్తానని చెప్పి మృత్యువాత పడడంతో మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.